పోస్ట్‌లు

ప్రతి శుక్రవారం లక్ష్మి పూజ ఎందుకు చేయాలి ?

  ప్రతి శుక్రవారం లక్ష్మి పూజ ఎందుకు చేయాలి ?          సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే   మన పురాణాల ప్రకారం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఆయన పేరుమీదుగానే శుక్రవారం ఏర్పడింది. అలాగే  శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి మరెవరో కాదు బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు.   లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరుతో కూడా పిలుస్తూంటారు. ఈ రకంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది. అందుకే లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీస్సులు పొందేందుకు  లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు, స్తుతులు పఠిస్తారు.  అలాగే సృష్టిలో కనిపించే సర్వ వైభవాలు లక్ష్మీదేవి భిన్నమైన వ్యక్తరూపాలే. అవే అష్టలక్ష్ములు.  భౌతిక సంపదలే కాదు.. మోక్షం, స్వాతంత్య్రం మొదలైనవి కూడా లక్ష్మీదేవి చిహ్నాలే.         శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ                                   శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా        
ఇటీవలి పోస్ట్‌లు