భగవద్గీతని పూర్తిగా అర్దం చేసుకుంటూ వినే అద్బుత అవకాసం

updated: August 9, 2018 17:51 IST
భగవద్గీతని  పూర్తిగా అర్దం చేసుకుంటూ వినే అద్బుత అవకాసం

భగవద్గీతని  పూర్తిగా అర్దం చేసుకుంటూ వినే అద్బుత అవకాసం 

ఎక్కడైనా భగవద్గీత  వినిపడగానే... మన మనస్సులో ఒకటే ఆలోచన. ఎవరో చని పోయినట్లు ఉన్నారు అని. అవును అది నిజం.. అలా మనస్సుల్లో తప్పుడు ముద్ర ముద్రితమైపోయింది.   

భగవద్గీత అనగానే అది కేవలం సన్యాసులకో, ముసలివారికో ఉద్దేశించిన పుస్తకంగా భావిస్తూంటాం.అలాగే మనందరికి భగవద్గీత అనగానే ఘంటశాల స్వరపరిచిన శ్లోకాలు గుర్తు వస్తాయి. అదీ ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వినదగినది అనుకుంటూ ఉంటాం. అంతేకాని మరణానికి, భగవద్గీత వినటానికి సంభంధం లేదని, కేవలం కాకతాళీయంగా ఆ సమయంలో వింటే కాస్త ధైర్యం వస్తుందని చెప్పటంతో..మన ఆప్తులు మరణించినప్పుడు దాన్ని వింటూ వస్తున్నాం. 

అయితే కాలం గడిచేసరికి... ఇప్పుడు అదో శవ సంప్రదాయంగా మారి.. ఆ సమయంలో ఖచ్చితంగా వినాలని, కేవలం అప్పుడే వినాలని మానసికంగా గత కొన్ని ఏళ్లుగా ఫిక్సైపోయాం. దానికి తగినట్లు  ఆ రోజు పెద్ద మైకులో భగవగ్దీతను పెట్టడం,చనిపోయిన వారి పేరట భగవద్గీను పంచటం చేస్తూంటారు. ఇంకాస్త ముందుకు వెళితే మనకు భగవగ్దీత అనగానే కోర్టులో ..నిందితుడు చేత భగవగ్దీత సాక్షిగా అంతా నిజమే చెప్తాను అనటం గుర్తువస్తుంది. 

అంతేకానీ మన విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర సుప్రభాతంలా భగవద్గీత కూడా రోజు వినదగినది అని తెలుసుకోలేకపోతున్నాం.  అలాగే లౌకికమైన లక్ష్యాన్ని గుర్చి మానసిక సంఘర్షణలో ఉన్న ప్రతీ వ్యక్తికి ఉపయోగపడే బోధ అని అర్దం చేసుకోలేకపోతున్నాం. 

అయినా మనలో ఎంతమందిమి భగవద్గీతను పూర్తిగా చదివాం? కనీసం విన్నాం?  భగవద్గీత అంటే కేవలం ఘంటశాలగారి పాడిన శ్లోకాలు మాత్రమే అనుకోవటం వల్ల 108 శ్లోకాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నాం.  కానీ నిజానికి భగవద్గీత అంటే 18 చాప్టర్స్...701 శ్లోకాలు ఉన్నాయి. 
 
 భగవద్గీత  ఎక్కువ పాపులర్ కాకపోవటానికి ఒక కారణం అది గ్రాధిక భాషలో ఉండటం...ఈ విషయాలన్ని గమనించిన BhagavdGeeta.com వారు, ప్రముఖ రచయిత ఎంత క్లిష్టమైన విషయాన్ని అయినా చాలా సరళంగా చెప్పగలిగే సామర్దం ఉన్న ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి చేత తేలికైన తెలుగు పదాలతో  భగవద్గీత ని అనువదించారు. ఇది పుస్తక రూపంలో వచ్చింది. ఆ పుస్తకాన్ని ఆడియో రూపంలో ప్రతీ ఒక్కరూ వినటానికి గానూ telugu100.com మీ ముందుకు తెచ్చింది..వినటం మీదే ఆలస్యం..

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: BhagavadGita Video, Sri Malladi Venkata Krishna Murthy, Rani Srinivasa Sarma

comments